శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అక్కులపేట, శ్రీనివాసాచార్యులుపేట, వేణు అమ్మపేట గ్రామాల్లో ఉన్ననిరుపేదకుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. విశ్రాంత ఆర్టీఓ బొడ్డేపల్లి గౌరీపతి రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ ఇంటింటికీ వెళ్లి వీటిని అందించారు. కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
నిరుపేదలకు ప్రభుత్వ మాజీ విప్ నిత్యావసరాలు పంపిణీ - నిరుపేదలకు ప్రభుత్వ మాజీ విప్ నిత్యావసరాలు పంపిణీ
ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదలకు ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
![నిరుపేదలకు ప్రభుత్వ మాజీ విప్ నిత్యావసరాలు పంపిణీ koona ravikumar distributes essential goods to poor family](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6790198-590-6790198-1586874905683.jpg)
నిరుపేదలకు ప్రభుత్వ మాజీ విప్ నిత్యావసరాలు పంపిణీ