ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్ముడి కిరాతకం.. ఆస్తి కోసం అక్క, అన్నను చంపేసిన సోదరుడు - murder latest News

తమ్ముడి కిరాతకం.. ఆస్తి కోసం అక్క, అన్నను చంపేసిన సోదరుడు
తమ్ముడి కిరాతకం.. ఆస్తి కోసం అక్క, అన్నను చంపేసిన సోదరుడు

By

Published : Mar 7, 2021, 8:49 AM IST

Updated : Mar 7, 2021, 12:09 PM IST

12:08 March 07

08:43 March 07

తోడబుట్టిన వారిన హతమార్చిన సోదరుడు

తమ్ముడి కిరాతకం.. ఆస్తి కోసం అక్క, అన్నను చంపేసిన సోదరుడు

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రామచంద్రాపురంలో దారుణం చోటు చేసుకుంది.  ఆస్తి వివాదం కారణంగా కుటుంబంలో చిచ్చు పెట్టిన కలహాలు.. అన్నాచెల్లెళ్ల ప్రాణాలను బలిగొన్నాయి. తమ్ముడు గొర్లె రామకృష్ణ.. తన అక్క, అన్నను.. ఆస్తి కోసం అతి కిరాతకంగా హత్య చేశాడు. 

వెనుక నుంచి వచ్చి...

రామకృష్ణ అన్న సన్యాసిరావు ఉదయం పాల సేకరణ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన తమ్ముడు... కత్తితో నరకడంతో అక్కడక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న నిందితుడి అక్క జయమ్మ వెంటనే స్పందించి ముందుకు రావడంతో ఆమెను కూడా హతమార్చాడు. 

ఉలిక్కిపడ్డ స్థానికులు...

బాధితులిద్దరూ ఘటన స్థలంలోనే రక్తపు మడుగుల్లో మృతి చెందగా... గ్రామస్థులు ఉలిక్కిపడి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న జే రామచంద్రాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

వైకాపాకూ తప్పని అంతర్గత పోరు.. మున్సిపల్ బరిలో భారీగా రెబెల్స్

Last Updated : Mar 7, 2021, 12:09 PM IST

ABOUT THE AUTHOR

...view details