ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేడుకగా శతాధిక వృద్ధురాలు సీతారామమ్మ జన్మదినం - srikakulam district latest news

శ్రీకాకుళం జిల్లా కుమ్మరి గుంటలో వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ 101వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ.. ఆమె తన దైనందిన జీవితాన్ని సాగిస్తున్నారు.

ఘనంగా శతాధిక వృద్దురాలి జన్మదిన వేడుకలు
ఘనంగా శతాధిక వృద్దురాలి జన్మదిన వేడుకలు

By

Published : Aug 13, 2021, 10:33 AM IST

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కుమ్మరిగుంటకు చెందిన శతాధిక వృద్ధురాలు యాళ్ల సీతారామమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గతేడాది మార్చిలో కరోనా వైరస్‌ బారిన పడిన సీతారామమ్మ.. 14 రోజుల్లోనే కోలుకున్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య సూత్రాలను పాటించి మహమ్మారిని జయించారు. ఇప్పటికీ చలాకీగా జీవనం సాగిస్తున్న సీతారామమ్మకు నలుగురు సంతానం. గురువారం కుటుంబ సభ్యులు ఆమె శతాధిక జన్మదిన వేడుకలు సందడిగా నిర్వహించారు.

ఘనంగా శతాధిక వృద్దురాలి జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details