శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని రేగిడి, వెంకంపేట గ్రామాల వద్ద ఆకులలోవ గెడ్డ పొంగి ప్రవహిస్తోంది. విజయనగరం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద నీరు కాలువలో చేరడంతో పాటు నాగావళి వరద నీరు కాలువలలోకి వచ్చి చేరడంతో గడ్డ పొంగిపొర్లుతోంది. రేగిడి గ్రామంలో బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రవహించడంతో పాటు గ్రామాల్లోని వచ్చి చేరింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉన్నత పాఠశాల ఆవరణ నీట మునిగాయి.
Heavy Rains: వర్షాలకు పొంగిన ఆకులలోవ గెడ్డ.. నిలిచిన రాకపోకలు
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వరద నీరు ఆకులలోవ గెడ్డ కాలువలోకి చేరింది. దీంతోపాటు నాగావళి వరద నీరు కూడా కాలువల్లోకి వచ్చి చేరడంతో గెడ్డ పొంగిపొర్లుతోంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వర్షాలకు పొంగిన ఆకులలోవ గెడ్డ... నిలిచిన రాకపోకలు
రేగిడి ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరి, చెరకు పంటలు నీటమునిగాయి.
ఇదీ చదవండి: ACCIDENT: బైక్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి