రాష్ట్ర తెలుగు అకాడమీని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అకాడమీ అధ్యక్షురాలు డా.నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆమె.. గురుగుబెల్లి లోకనాథం రచించిన గులోనా గుళికలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగును బతికించేందుకే.. సంస్కృతాన్ని అకాడమీలో చేర్చారని ఆమె తెలిపారు. ఉపనిషత్తుల ద్వారా సంస్కృతం దేవ భాషగా మారిందని, తెలుగు భాష సంస్కృతంతో కలిసి.. రెండు భాషలు లీనమైపోయాయని అన్నారు. భాష రాష్ట్రంలో పేదల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని అయితే తెలుగును విధిగా నేర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.
రచయితలను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. రచనల ముద్రణకు తెలుగు అకాడమి ప్రయత్నించాలని సూచించారు. గులోన మరిన్ని రచనలు చేయాలని ఆకాక్షించారు. సమాజంలో జరుగతున్న అనేక సంఘటనల సంపుటే ఈ రచన అని రచయిత గురుగుబెల్లి లోకనాథం అన్నారు.