గుప్పుమన్న గంజాయి - jalanthakota
శ్రీకాకుళం జిల్లాలో పెద్దమొత్తంలో గంజాయి బయటపడింది. డీసీఎం వ్యానులో తరలిస్తున్న సుమారు 800 కిలోల గంజాయి పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి పట్టివేత
ఉత్తరాంధ్ర ఏజన్సీలో గంజాయి నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా.. సాగుమాత్రం ఆగడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల తనిఖీలో పెద్దమొత్తంలో గంజాయి దొరికింది. కంచిలి మండలం జలంతరకోట వద్ద పోలీసులు తనిఖీ చేయగా... డీసీఎం వ్యానులో తరలిస్తున్న సుమారు 800 కిలోల గంజాయి బయటపడింది. పోలీసులు ఎంత జాగ్రత్తగా తనిఖీలు చేస్తున్నప్పటికీ సరఫరా సాగుతూనే ఉంది.
Last Updated : Mar 2, 2019, 4:13 PM IST