గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అరెస్టు
గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు అరెస్టు - moliyaputti ganja caught
శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టిలో 450 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మెలియపుట్టి మీదుగా గంజాయి తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పాతపట్నం పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. 450 కేజీల గంజాయి, వ్యాన్, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మెలియపుట్టిలో గంజాయి పట్టివేత