శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను కొనసాగించారు. తొలుత ఇచ్ఛాపురంలో కొలువుదీరిన స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం గాంధీ సంకల్ప యాత్రను కొనసాగించారు. కార్యక్రమంలో భాగంగా బెల్లుపడ కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నరేంద్ర మోదీ నిజమైన గాంధీ వాదని భాజపా నేతలు అన్నారు. ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్లు సంకల్ప యాత్ర పూర్తిచేసి... నేటి తరానికి గాంధీ ఆశయాలను అందించాలనే ఉద్దేశంతో కొనసాగుతున్నట్లు తెలిపారు.
''మహాత్ముడి సిద్ధాంతాలు నేటి తరానికి అందించాలనే'' - ఇచ్ఛాపురంలో గాంధీ సంకల్ప యాత్ర
మహత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో భాజపా ఆధ్వర్యంలో గాంధీజీ సంకల్ప యాత్రను కొనసాగించారు. మహాత్ముడి సిద్ధాంతాలు.. జ్ఞాపకాలు నేటి తరానికి అందించాలనే లక్ష్యంతో సంకల్ప యాత్ర కొనసాగిస్తున్నామని భాజపా శ్రేణులు పేర్కొన్నారు.

gandhiji sankalpa yatra in icchhapuram