ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాను తరిమేందుకు గణపతి హోమం - Umakameshwara Swamy Temple latest news update

కరోనా నివారణ కోసం శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వంశధార నదీతీరంలో ఉన్న ఉమాకామేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. 22మంది వేద పండితులు మంత్రోచ్ఛరణ నడుమ ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు.

Ganapati Homam
కరోనాను తరిమేందుకు గణపతి హోమం

By

Published : Jul 22, 2020, 7:46 PM IST

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో వంశధార నదీతీరంలో ఉన్న ఉమాకామేశ్వర స్వామి ఆలయంలో గణపతి హోమం నిర్వహించారు. కరోనా నివారణార్థం వేద పండితులు బంకుపల్లి భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో వాసుదేవ శర్మ, ఆనంద్ శర్మలు 22 మంది వేద పండితులతో కలిసి ఘనంగా గణపతి హోమం జరిపించారు. ముందుగా గణపతికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం, సహస్ర గరికపూసల పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య హోమం చేపట్టి.. పూర్ణాహుతితో ముగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details