శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరుకు చెందిన బొంగు బాబూరావు... 2009లో అసోం రైఫిల్స్‌లో జవానుగా చేరి అరుణాచల్‌ప్రదేశ్‌లోని భోన్సా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వివాహం చేసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వగ్రామానికి వచ్చారు. అదే నెల 14న తాటిపట్టికి చెందిన మీనాక్షిని పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబరు 27న విధుల్లో చేరేందుకు సరిహద్దుకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో మెడకు బుల్లెట్ తగిలి మృతి చెందారు.
శోకసంద్రంలో కుటుంబీకులు...
విధుల్లో చేరిన మూడు రోజులకే ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. బాబూరావు తండ్రి పురుషోత్తం కొన్నేళ్ల క్రితం చనిపోగా.. తల్లి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.