ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన శ్రీకాకుళం జడ్పీ సీఈవో అంత్యక్రియలు - విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన జడ్పీ సీఈవో

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవో గుండు చక్రధర బాబు బుధవారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామం జడూరులో జరిగాయి.

Funeral ending for ZP CEO physical body
ముగిసిన శ్రీకాకుళం జడ్పీ సీఈవో అంత్యక్రియలు

By

Published : Oct 22, 2020, 4:54 PM IST

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవో గుండు చక్రధర బాబు అంత్యక్రియలు గురువారం ఉదయం పోలాకి మండలం జడూరు గ్రామంలో జరిగాయి. జడ్పీ సీఈవోగా ఆయన గతేడాదే బాధ్యతలు స్వీకరించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మధ్యాహ్నం విశాఖపట్నం కేర్ ఆస్పత్రిలో మృతి చెందారు. చక్రధర బాబు భౌతిక కాయానికి కలెక్టర్ జె నివాస్, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు, తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి: సవాల్ చేయడం కాదు... రాజీనామా చేసి బరిలోకి రండి: మంత్రి అప్పలరాజు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details