ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధులు జారీ - news srikakulam silparamam

శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధుల వినియోగానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధికి రూ.10 కోట్లు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటు చేసేందుకు రూ. 3 కోట్లు మంజూరు చేశారు.

Funds issued for construction of Shilparamas at Srikakulam and Tirupati
శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధులు జారీ

By

Published : Oct 3, 2020, 2:22 PM IST

శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి నిధుల వినియోగానికి పరిపాలనానుమతులను ప్రభుత్వం జారీ చేసింది. తిరుపతిలో శిల్పారామం అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం 10 కోట్ల రూపాయలను కేటాయించారు. శిల్పారామం కోసం ఆర్చి, నీటి సరఫరా, నడక దారులు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాలను వెచ్చించనున్నారు.

అటు శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటు చేసేందుకు గానూ తొలివిడతగా 3 కోట్ల రూపాయలను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంజూరు చేసింది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పారామంలో నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి: విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details