శ్రీకాకుళం జిల్లా రాజాంలో మల్లికార్జున కాలనీలో మురళి అనే వ్యక్తి స్నానాల గదిలో పడి మృతి చెందగా.. బంధువులు ఎవరూ రాకపోవడంతో స్నేహితులే అంత్యక్రియలు నిర్వహించారు.
స్నానాల గదిలో పడి వ్యక్తి మృతి.. అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు - friends in funerals in rajam news
రాజాంలో మురళీ అనే వ్యక్తి స్నానాల గదిలో పడి మృతి చెందాడు. స్థానికులు అతని బంధువులకు సమాచారమిచ్చినా రాలేదు. దీంతో అతని స్నేహితులే చివరి మజిలీ పూర్తి చేసి మానవత్వం చాటుకున్నారు.
మల్లికార్జున కాలనీలో మురళి తన తండ్రి శ్రీమన్నారాయణతో కలసి ఉంటున్నాడు. వీరిద్దిరికి కరోనా సోకడంతో శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. కోలుకుని ఈ మధ్యే ఇంటికి వచ్చారు. ఇవాళ మురళీ స్నానాల గదిలో పడి మృతి చెందగా.. తన తండ్రి శ్రీమన్నారాయణ నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాలనీవాసులు బంధువులకు సమాచారం ఇచ్చిన ఎవరూ రాలేదు. దీంతో స్నేహితులే అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి:వైరల్ వీడియో: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి మత ప్రార్ధనలు.. లక్ష జరిమానా