శ్రీకాకుళం జిల్లాలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో తొమ్మిది మండలాల్లోని 259 సర్పంచ్ స్థానాలకు అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 2,696 పోలింగ్ కేంద్రాల్లో.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన అధికారులు.. ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళంలో నాలుగో విడత పోలింగ్ తీరు తెన్నులు
నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటం.. రద్దీ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
శ్రీకాకుళంలో పోలింగ్ తీరు తెన్నులు
నరసన్నపేట నియోజకవర్గంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు 32 శాతం పోలింగ్ నమోదు కాగా.. 129 గ్రామ పంచాయతీలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. నరసన్నపేట మండలం పోతయ్య వలస గ్రామంలో ఇప్పటివరకు 67శాతం పోలింగ్ జరిగింది. ఓటు వేసేందుకు తక్కువ సమయం ఉండటంతో ఓటర్లు పోలీంగ్ కేంద్రాల వద్దకు తరలివస్తుండటం కొంతమేర రద్దీ నెలకొంది.
ఇవీ చూడండి..:పంచాయతీ ఎన్నికల విధులకు సిబ్బంది డుమ్మా..!