అంగన్వాడీ కేంద్రంలో అహారం తిని.. 13 మంది చిన్నారులకు అస్వస్థత - శ్రీకాకుళం జిల్లా వార్తలు
15:55 February 26
కుప్పిలిలో 13 మంది చిన్నారులకు అస్వస్థత
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి అంగన్వాడీ కేంద్రంలో 13 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం, పాలు తీసుకున్న తరువాత.. చిన్నారులకు వాంతులు కావడంతో అందరూ ఆందోళన చెందారు.
వెంటనే రెండు 108 వాహనాల్లో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న జీజీహెచ్ వైద్యులు.. చిన్నారులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని జీజీహెచ్ ఆర్‌ఎంవో హేమంత్ చెప్పారు.
ఇదీ చదవండి: