శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ప్రాజెక్టుల మీద దృష్డిసారించారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పొందూరు మండలం తాడివలసలోని రెల్లిగెడ్డ ప్రాజెక్టు ఆధునీకరణ పునఃప్రారంభం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో నిర్మించిన డ్యాం వరదల కారణంగా కూలిపోయిందన్న సభాపతి.. దీని వల్ల ఆరు వేల ఎకరాల్లోని పంటలను రైతులు నష్ట పోయారన్నారు. ఇప్పుడు మళ్లీ పునఃనిర్మాణ పనులను ప్రారంభిస్తున్నామని సభాపతి తెలిపారు. పదికాలల పాటు రెల్లిగడ్డ ప్రాజెక్టు రైతులకు ఉపయోగపడాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కోరుకున్నారన్నారు.
జిల్లాలో ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం: సభాపతి తమ్మినేని - srikakulam news
శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఆయకట్టకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. అందులో భాగంగా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే విధంగా జిల్లాలోని ప్రాజెక్ట్‌ల రీడిజైన్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
శాసన సభాపతి తమ్మినేని సీతారాం
సమస్యలను నిశితంగా పరిశీలించి.. మంచి డిజైన్‌తో రైతులకు ఉపయోగపడే విధంగా రెల్లిగడ్డ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే మడ్డువలస ప్రాజెక్టు, నారాయణపురం ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారన్నారు.