అలిగి వెళ్లిపోయిన కేంద్ర మాజీమంత్రి..! - అలిగిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో.. మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అలిగారు. శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహం హెలీపాడ్ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రొటో కాల్ జాబితాలో తన పేరు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ధర్మాన కృష్ణదాస్ సద్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. ఆమె శాంతించలేదు.
అలిగిన మాజీ కేంద్రమంత్రి కృపారాణి