ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి నిరసన - ap government failed in carona time said by former mla

ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తన ఇంటి వద్ద నిరసన తెలియజేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. కనీసం వైద్య సిబ్బందికి కూడా తోడ్పాటు అందిచలేకపోయారని విమర్శించారు.

srikakulam district
ఆమదాలవలసలో మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి నిరసన

By

Published : Apr 25, 2020, 9:59 AM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తన ఇంటి వద్ద శుక్రవారం నిరసన తెలియజేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ పిలుపు మేరకు కరోనా వైరస్ వంటి సంక్షోభ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని నిరసన ప్రదర్శన చేశామని తెలిపారు. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో శానిటైజర్ గాని మాస్కులు ప్రజలకు అందించడంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేస్తున్న వైద్యాధికారులకు సిబ్బందికి ఎటువంటి పరికరాలు, ఇతర వస్తువులు అందించలేదని, ఇలా అయితే ఎలా పని చేయగలరని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ సనపల అన్నాజీరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details