ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ అధికారులు.. - ఎలుగుబంటి తాజా వార్తలు

BEAR CAUGHT
ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి పట్టుకున్న అటవీ సిబ్బంది

By

Published : Jun 21, 2022, 12:06 PM IST

Updated : Jun 21, 2022, 1:27 PM IST

12:03 June 21

ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి పట్టుకున్న అటవీ సిబ్బంది

ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి పట్టుకున్న అటవీ సిబ్బంది

BEAR CAUGHT: శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటిని వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో అటవీ అధికారులు పట్టుకున్నారు. కిడిసింగిలోని పశువుల పాకలో ఉన్న ఎలుగును మత్తు ఇంజక్షన్​తో షూట్‌ చేసి బంధించారు. రెండు రోజుల నుంచి స్థానికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో మొన్న కలమటి కోదండరావు(72) మృతి చెందగా. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

ఇదీ జరిగింది..

ఎలుగుబంటి దాడితో ఉద్దానం ప్రాంతం బిక్కుబిక్కుమంటోంది. వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల్లో జీడిమామిడి తోటలు ఎక్కువ. ఈ తోటల్లో ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయి. గతకొన్ని రోజులుగా.. ఈ ఎలుగుబంట్లు జనంపై దాడులు చేస్తున్నాయి. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఆదివారం రోజు ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు విడిచారు. ఈ ఘటన జరిగిన..మరుసటి రోజే..ఆరుగురు వ్యక్తులపైనా భల్లూకం దాడి చేసింది.

సోమవారం రోజున వజ్రపుకొత్తూరు సంతోషిమాత ఆలయ సమీపంలోని జీడి తోటలో.. పశువుల కోసం రేకుల షెడ్డు వేస్తుండగా ఎలుగుబంటి దాడిచేసింది. బాధితుల కేకలు విని పక్కనే రహదారిపై వెళ్తున్న ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు, మరో వ్యక్తి అక్కడకు వెళ్లారు. వారిని ఎలుగుబంటి తీవ్రంగా గాయ పరిచింది. వీరి అరుపులు విని అక్కడకు వచ్చిన ఇద్దరు జవాన్లు.. భల్లూకం దాడికి గురయ్యారు.

గాయపడిన వారు.. శ్రీకాకుళంలోని మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులందరికి మైరుగైన వైద్యం అందించాలని..మంత్రి సీదిరి అప్పలరాజు సూచించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన..అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఎలుగుబంట్ల దాడులతో భయంభయంతో బతుకుతున్నామని.. వాటి నుంచి తమను కాపాడాలని.. ఆ ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 21, 2022, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details