భారత్ పర్యటనకు వచ్చిన విదేశీ బృందం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురంలో ఉన్న పురాతన సీతారాముల ఆలయాన్ని సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణ పరిధిలో ఉన్న కంచరాం గ్రామంలో ఉన్న తృప్తి రిసార్ట్లో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ కళా నైపుణ్య ప్రదర్శనలో పాల్గొన్న ఈ విదేశీ బృందం... పురాతన ఆలయాలను సందర్శించింది. 16వ శతాబ్ద బొబ్బిలి సంస్థానం పాలకులు నిర్మించిన గుళ్ళ సీతారాంపురం ఆలయాన్ని ఏకాంత సేవలో దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురోహితులు ఆలయ విశిష్టతను, చరిత్రను వివరించారు. అనంతరం దేవాలయంలో రాతితో నిర్మించిన శిల్ప సంపదను ఆసక్తిగా తిలకిస్తూ, కెమెరాల్లో బంధించారు.
గుళ్ళ సీతారాంపురం ఆలయానికి విదేెశీ బృందం - gulla sitha rampuram
మన దేశంలో పది రోజుల పర్యటనకు వచ్చిన విదేశీ బృందం... శ్రీకాకుళం జిల్లా గుళ్ళ సీతారాంపురంలో ఉన్న పురాతన సీతారాముల ఆలయాన్ని సందర్శించింది.
గుళ్ళ సీతారాంపురం పురాతన ఆలయాన్ని సందర్శించిన విదేెశీ బృందం