ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాతపట్నంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు - food saftey chekings in pathapatnam

ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్​ సరిహద్దు గ్రామాల్లో... నిషేధిత లంకపిండి విక్రయాలు జరగుతుందన్న సమాచారంతో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు.

పాతపట్నంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

By

Published : Nov 21, 2019, 8:04 PM IST

పాతపట్నంలో ఆహార భద్రత అధికారుల తనిఖీలు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో... నిషేధిత లంకపిండి విక్రయం జరగుతుందన్న సమాచారంతో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. అమరావతి నుంచి వచ్చిన జాయింట్ ఫుడ్ కంట్రోలర్... కేఎన్ స్వరూప్ ఆధ్వర్యంలో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. ఒడిశా నుంచి సరిహద్దు గ్రామాల్లోకి అక్రమంగా తీసుకొచ్చే లంకపిండిని... శనగపిండిలో కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పాతపట్నం ప్రధాన రహదారిలోని దుకాణాల్లో తనిఖీలు చేసి... నమూనాలు సేకరించారు. లంకపిండి వాడటం కారణంగా... ధనుర్వాతం, అంధత్వంతోపాటు పలు వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయి. అందుకే రాష్ట్రంలో దీన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details