శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో రెండు రంగుల మందార పువ్వు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మందారం పువ్వులు సాదారణంగా ఒకే వర్ణంలో పూస్తూ ఉంటాయి. గ్రామానికి చెందిన జి. చంద్రశేఖర్ ఇంటి ఆవరణంలోని ముద్ద మందారం చెట్టుకి ఎరుపు రంగు, లేత ఆరంజ్ రంగులో పువ్వు పూసింది. ఈ పువ్వు రెండు రంగులతో సరి సమానంగా కనిపిస్తూ చూపరులను కనువిందు చేస్తోంది.
రెండు రంగుల్లో మందారం.. ఎక్కడో తెలుసా..! - srikakulam district news
సాధారణంగా మందార పువ్వు ఒకే వర్ణంలో పూస్తుంది. మందస మండలం హరిపురంలో మాత్రం ఎరుపు, లేత గులాబీ వర్ణాలలో పూసి చూపరులను ఆకట్టుకుంటోంది.
flower in two colours at haripuram srikakulam distrit
ఈ విషయం తెలిసి చూసేందుకు అనేకమంది వస్తున్నారని జి.చంద్రశేఖర్ తెలిపారు. మొదట ఎర్రగానే పూసేదని ఇప్పుడు మాత్రం రెండు వర్ణాలతో పూసిందని ఆయన తెలిపారు. బాహ్య, మధ్య ఉత్పరివర్తనాలతో ఇలాంటి పుష్పాలు పూస్తాయని మందస మండల ఉద్యానవనశాఖ అధికారి సీహెచ్ శంకర్ దాస్ తెలిపారు.
ఇదీ చదవండి:Srikakulam: 'రాళ్లు కొట్టిన చెయ్యి'.. పిడికిలెత్తింది..!