ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిడుగుపాటుకు ఐదుగురు మృతి - thunder storm in srikakulam latest news

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. వంగర మండలంలో ముగ్గురు మృతి చెందగా.. రాజాం, సీతంపేట మండలాల్లో ఒక్కొక్కరు మృత్యువాతపడ్డారు.

five persons died over thunder storm
పిడుగుపాటుకు ఐదుగురు మృతి

By

Published : May 30, 2020, 12:02 AM IST

వంగర మండలం శ్రీహరిపురంలో వడ్డిపల్లి శంకరరావు అనే 43 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. గీతనాపల్లిలో సాలాపు శ్రీరాములునాయుడు అనే 61 సంవత్సరాల వ్యక్తితో పాటు శనపతి అచ్చుతరావు అనే 16 సంవత్సరాల బాలుడు పిడుగుపడి మృతిచెందారు. రాజాం మండలం కొఠారిపురంలో కింతలి సింహాచలం అనే 38 ఎళ్ల రైతు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. సీతంపేట మండలం తుంబకొండలో పిడుగుపాటుకు ఆరిక ఆనంద్‌ అనే 35 సంవత్సరాల వ్యక్తి మృతి చెందగా... నిమ్మక గోపి అనే వ్యక్తి గాయాలపాలై స్వస్థతకు గురయ్యారు. పాలకొండ ఆసుపత్రిలో గోపి అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో మృతులు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details