శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం గుగ్గిలి గ్రామంలో అదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తూలుగు లక్ష్మణరావు, ఎలమంచిలి రాజు అనే రైతులకు చెందిన ఐదు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం - paddy piles burn at gugguli
శ్రీకాకుళం జిల్లా గుగ్గిలి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఎంతో కష్టపడి పండించిన వరి పంటను బూడిదగా చూసిన ఆ రైతులు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు.
![గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం paddy piles burn in a fire incident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10728858-86-10728858-1613986045403.jpg)
గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం
రాజకీయ కక్షతోనే గుర్తుతెలియని వ్యక్తులు ధాన్యం కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి:పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
Last Updated : Feb 22, 2021, 4:23 PM IST