గుజరాత్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన అయిదు వేల మందికి పైగా మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మూడు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం సహాయ నిధి నుంచి ఈ మొత్తాన్ని వెచ్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. వారిని బస్సుల ద్వారా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏపీ మత్స్యకారులను వెనక్కి రప్పించేందుకు మార్గం సుగుమం
లాక్డౌన్ కారణంగా గుజరాత్లో చిక్కుకున్న ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యకారులు ఎట్టకేలకు స్వరాష్ట్రానికి చేరుకోనున్నారు. వారిని గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు అవసరమైన నిధులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చేసేందుకు అనుమతులు జారీ అయ్యాయి.
స్వరాష్ట్రానికి చేరుకోనున్న మత్స్యకారులు