ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే పడవలో 4 రోజులు ప్రయాణం... చివరికి..?

చెన్నై నుంచి సముద్ర మార్గంలో 37 మంది మత్స్యకారులు రాష్ట్రానికి చేరుకున్నారు. ఈనెల 23న రాత్రి 10 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి.. 4 రోజులు ప్రయాణం సాగించారు. చివరకు శ్రీకాకుళం ఇచ్చాపురం దొంకురు సమీపంలో ఒడిశా తీర ప్రాంతం గుండా గోపాలపురం వచ్చారు.

fishermen from Chennai to coast
fishermen from Chennai to coast

By

Published : Apr 27, 2020, 7:39 PM IST

చెన్నై నుంచి సముద్ర మార్గంలో పడవ ద్వారా ..మరో 37 మంది మత్స్యకారులు తీరానికి చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని దొంకురు సమీపంలో ఒడిశా తీర ప్రాంత గ్రామమైన సున్నపురం మీదుగా గోపాలపురం చేరుకున్నారు. వీరిలో వాని పాలేనికి చెందిన వారు ముగ్గురు, డొంకూరు గ్రామానికి చెందిన వారు ఐదుగురు ఉన్నారు.

మిగతా 29 మంది ఒడిశాకు చెందిన వారు. వీరంతా కలిసి 1.80 లక్షలతో పాత పడవను కొనుగోలు చేసి.. ఈనెల 23న రాత్రి 10 గంటలకు చెన్నై నుంచి బయలు దేరారు. నాలుగు రోజుల పాటు ప్రయాణం సాగించారు. ఒకే పడవలో ప్రమాదకర ప్రయాణం సాగించి తీరానికి చేరుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details