పాక్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈ నెల 6న విడుదల కానున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. రాష్ట్ర ఎంపీలకు ఈ మేరకు సమాచారాన్ని ఇచ్చింది. ఏడాది క్రితం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన 22మంది మత్స్యకారులు చేపలవేట కోసం వెళ్లారు. గుజరాత్ తీరం వద్ద పాక్ జలాల్లోకి పొరపాటున ప్రవేశించటంతో... పాకిస్థాన్ అధికారులు జాలర్లను అరెస్టు చేశారు. ఇన్నాళ్లూ పాక్ చెరలో ఉన్నవారిని విడిచిపెట్టాలని ఎంపీలు రామ్మోహన్ నాయుడు, విజయసాయిరెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పాక్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన కేంద్రం....జాలర్ల విడుదలకు చర్యలు తీసుకుంది. చర్చలు ఫలించటంతో జాలర్ల విడుదలకు పాక్ ప్రభుత్వం అంగీకరించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
పాకిస్థాన్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈనెల 6న విడుదల ! - fisherman's release to pak jail on jan 6th
![పాకిస్థాన్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈనెల 6న విడుదల ! fisherman's release to pak jail on jan 6th](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5579830-833-5579830-1578042176092.jpg)
fisherman's release to pak jail on jan 6th
13:23 January 03
పాకిస్థాన్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈనెల 6న విడుదల !
పాకిస్థాన్ చెరలో ఉన్న ఆంధ్ర జాలర్లు ఈనెల 6న విడుదల !
Last Updated : Jan 3, 2020, 3:14 PM IST
TAGGED:
fishermans