లబ్ధిదారుల ఖాతాల్లో మత్స్యకార భరోసా నిధులు జమ కాకుండా అనర్హుల ఖాతాల్లో నగదు జమ అయిందంటూ... శ్రీకాకుంళం జిల్లా సోంపేట మండలం ఉప్పలాం గ్రామసచివాలయం వద్ద బాధితులు ఆందోళన చేశారు. ఫలితంగా అర్హులైన వారికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు మత్య్యకారులు తెలిపారు. ఈ అంశంపై తమకు న్యాయం చేయాలని కోరారు.
గ్రామసచివాలయం ఎదుట మత్స్యకారుల ఆందోళన - srikakulam district latest news
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఉప్పలాం గ్రామసచివాలయం వద్ద మత్స్యకారులు ఆందోళన చేశారు. అర్హులైన వారి ఖాతాల్లో కాకుండా అనర్హుల ఖాతాల్లో మత్స్యకార భరోసా నిధులు జమ అయ్యాయంటూ ఆరోపించారు.

గ్రామసచివాలయం ఎదుట మత్స్యకారుల ఆందోళన