శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలి ప్యారి ఇండియా చక్కెర కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెరుకు పిప్పికి నిప్పు అంటుకోవడం వలన అగ్ని ప్రమాదం జరిగిందని యాజమాన్యం తెలిపింది. కన్వేయర్ బెల్టుకు మంటలు వ్యాపించడం వల్ల కార్మికులు అప్రమత్తమయ్యారు. అగ్ని మాపక సిబ్బంది... నాలుగు శటకాలతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అయిదు కన్వేయర్ బెల్టులు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రూ. 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది. ప్రాణనష్టమేమి జరగలేదని స్పష్టతనిచ్చింది.
చక్కెర కర్మాగారంలో ప్రమాదం... రూ.50 లక్షల ఆస్తి నష్టం - సంకిలి
శ్రీకాకుళం జిల్లా సంకిలి చక్కెర కర్మాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చెరకు పిప్పికి అంటుకున్న అగ్ని... కన్వేయర్ బెల్టుకు వ్యాపించింది. ఈ ప్రమాదంలో రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది.
సంకిలి చక్కెర కర్మాగారంలో అగ్ని ప్రమాదం