శ్రీకాకుళం నగరంలోని జీటీ రోడ్డులో ఉన్న రాయల్ ఆప్టిక్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయాన్నే షాప్ తెరిచి శుభ్రం చేస్తున్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయని దుకాణ సిబ్బంది తెలిపారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. దుకాణం ఫైర్స్టేషన్కు దగ్గరలోనే ఉన్నందున సమయానికి చేరుకున్నామనీ.. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగామని ఫైర్ ఆఫీసర్ శ్రీనుబాబు తెలిపారు. సుమారు 35 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణ యజమాని చెప్పారు.
కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. 35 లక్షల ఆస్తి నష్టం - shop
కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. అందులో ఉన్న కళ్లజోళ్లన్నీ బూడిదయ్యాయి. సుమారు 35 లక్షల ఆస్తి నష్టం సంభవించింది.
కళ్లజోళ్ల దుకాణంలో అగ్నిప్రమాదం.. 35 లక్షల ఆస్తి నష్టం