ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణాపాయం! - fire blown out in car near tekkali tahsildar office

ఆగి ఉన్న కారులో మంటలు చెలిరేగి ఇంజన్ భాగం కాలిపోయిన ఘటన.. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో జరిగింది. బ్యాటరీలో షార్ట్ సర్క్యూటే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించగా.. ప్రాణాపాయం తప్పింది.

fire accident in car
కారులో అగ్ని ప్రమాదం

By

Published : Dec 29, 2020, 10:55 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో.. రహదారి పక్కన ఆపి ఉంచిన కారు నుంచి మంటలు చెలరేగాయి. సంతబొమ్మాళి మండలం రాజగోపాలపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ముడిదాన బాబూరావు కారు ఇంజన్ భాగం ఈ ఘటనలో కాలిపోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేయగా.. వాహనంలో ఉన్న మరో వ్యక్తికి ప్రమాదం తప్పింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

కారులో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details