వువ్వపేటలో 20 బస్తాల ధాన్యం దగ్ధం - శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో అగ్నిప్రమాదం
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 బస్తాల ధాన్యం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వువ్వపేట గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నారాయణ సాహూ రైతు వరి పంటను కళ్లంలో ఉంచగా... ధాన్యంపై ఉన్న వరి గడ్డి నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న కొందరు రైతులు మంటలు అదుపు చేయగా... అప్పటికే 20 బస్తాల ధాన్యం పూర్తిగా ధగ్ధమయ్యింది. కరోనా కారణంగా రైతులకు మద్దతు ధర లేకపోవడంతో పాటు ప్రమాదం జరిగి పూర్తిగా నష్టపోయామని నారాయణ సాహు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి సహాయం అందించాలని రైతులు కోరుతున్నారు.