ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేరసాంలో అగ్నిప్రమాదం... 12పూరిళ్లు దగ్ధం - దేరసాం గ్రామంలో అగ్నిప్రమాదం న్యూస్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12పూరిళ్లు దగ్ధమయ్యాయి. సుమారు 25 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. కూలీ పనులకు వెళ్లే సమయంలో ప్రమాదం జరగటంతో ప్రాణాలతో బయటపడ్డామని స్థానికులు తెలిపారు. కట్టుబట్టలతో మిగిలిన తమను... ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

fire accident
దేరసాంలో అగ్నిప్రమాదం... 12పూరిళ్లు దగ్ధం

By

Published : Dec 11, 2020, 12:24 PM IST

Updated : Dec 11, 2020, 1:41 PM IST

దేరసాంలో అగ్నిప్రమాదం... 12పూరిళ్లు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం దేరసాం గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామస్థులు కూలీ పనులకు వెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో... ఇళ్లలో ఉన్న సామగ్రితో పాటు బియ్యం, నగదు, విలువైన వస్తువులు, భూమి పత్రాలు ఇతర వస్తు సామాగ్రి కాలి బుడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారుగా రూ.25 లక్షలు వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్థులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని భాదితులు కోరుతున్నారు.

Last Updated : Dec 11, 2020, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details