శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వాహనదారులకు అధికారులు జరిమానా విధిస్తున్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి రూ.వంద అపరాధ రుసుమును వసూలు చేస్తున్నామని కార్యదర్శి శ్రీహరి కృష్ణ తెలిపారు.
మాస్కు లేకుండా బయటకు వస్తే.. జరిమానా - పాతపట్నం నేటి వార్తలు
కరోనా వ్యాప్తి నివారణకు మాస్కులు ధరించాలని చెబుతున్నా కొందరు వాటిని పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేకుండానే బయటకు వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పంచాయతీ అధికారులు.. మాస్కులు లేకుండా వస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. మాస్కు లేకుండా బయటకు వస్తే అపరాధ రుసుమును వసూలు చేస్తున్నారు.
![మాస్కు లేకుండా బయటకు వస్తే.. జరిమానా Fine to people who came to out side without masks in pathapatnam srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7667418-604-7667418-1592473498112.jpg)
మాస్కు లేకుండా బయటకు వస్తే అపరాధ రుసుము విధింపు