శ్రీకాకుళం జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా చేసేందుకు వ్యవసాయ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నివాస్ సూచించారు. గురువారం సాయంత్రం ఆయన నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఖరీఫ్ విత్తనాల సరఫరాలో మంచి ప్రగతి సాధించామని, అదే రీతిలో ఎరువులు కూడా అందజేసేందుకు సిద్ధం కావాలన్నారు. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి స్థలాలు సేకరించాలని అధికారులకు తెలిపారు.
'ఎరువుల పంపిణీకి సిద్ధంగా ఉండాలి...' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలోని రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులను అందించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ మేరకు జిల్లాలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి స్థలాలను సేకరించాల్సిందిగా రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
!['ఎరువుల పంపిణీకి సిద్ధంగా ఉండాలి...' srikakulam collecter conferenced to revenue officers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7583566-545-7583566-1591946028635.jpg)
రెవెన్యూ అధికారులతో కలెక్టర్ నివాస్ సమీక్ష