Father killed son: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో దారుణం జరిగింది. కన్నతండ్రే కుమారుడిని హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొలివి రాము ఆర్మీలో చేరాడు. ఉన్మాదిగా మారడంతో రామును ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో స్వగ్రామానికి చేరుకుని.. ఇంటి దగ్గరే ఉంటున్న రాము తరచూ గ్రామస్థులపై దాడులకు పాల్పడేవాడు. నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేది.
ఉన్మాదిగా మారిన కుమారుడు, తండ్రి ఏం చేశాడంటే - father killed son
Murder in Srikakulam ఆర్మీలో మంచి ఉద్యోగం. చేతికి అందివచ్చిన కుమారుడు కుటుంబానికి ఆసరాగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఏం జరిగిందో తెలియదు కుమారుడు ఉన్మాదిగా మారాడు. అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం కోల్పోయాడు. దీంతో చేసేదేమీ లేక ఇంటికి వచ్చాడు. పోనీ తర్వాతైనా సరిగా ఉంటాడనుకుంటే చుట్టుపక్కల వాళ్లతో నిత్యం గొడవలే. ఆఖరికి ఇంట్లో వాళ్లతోనూ అదే తీరు. శనివారం రాత్రి ఏమైందోగానీ తల్లిపై కుమారుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి కుమారుడిని హతమార్చాలనుకున్నాడు. అంతే కొంతమందితో కలిసి కుమారుడిని కన్నతండ్రే హత్య చేశాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
తండ్రి చేతిలో హత్యకు గురైన కుమారుడు
శనివారం రాత్రి తన తల్లి పోలమ్మపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను శ్రీకాకుళం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. కుమారుడు రాము చేసిన ఘాతుకానికి విసిగిపోయిన తండ్రి సూర్యనారాయణ.. కొడుకును అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. స్థానికుల సహకారంతో విద్యుత్ స్తంభానికి రాముని కట్టి.. గుణపంతో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం తెలుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: