ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రికి కరోనా.. ప్రేమ ఆగునా..! - శ్రీకాకుళం వార్తలు

ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంపై కరోనా పగబట్టింది. వైరస్ సోకిన తండ్రి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆ పేగుబంధం తల్లడిల్లింది. కళ్ల ముందే తండ్రిని వైరస్ కబళిస్తుంటే.. అతని కుమార్తె గుండెలవిసేలా రోధించింది. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా కొయ్యనపేటలో జరిగింది.

father died front of daughter  with corona
father died front of daughter with corona

By

Published : May 2, 2021, 10:21 PM IST

Updated : May 3, 2021, 8:34 AM IST

కరోనా.. కళ్లముందే ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయులను చేస్తోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఓ అమ్మాయి కొవిడ్‌ సోకి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కన్నతండ్రిని చూసి తల్లడిల్లిపోయింది. తల్లి వారిస్తున్నా.. తానే వెళ్లి గొంతులో గుక్కెడు నీళ్లు పోసింది. ఆ వెంటనే ఆయన మృతిచెందారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో ఆదివారం జరిగింది. జగన్నాథవలస పంచాయతీ కొయ్యానపేటకు చెందిన అసిరినాయుడు(44) విజయవాడలో కూలి పనులు చేసుకునేవారు. ఇటీవల అక్కడ పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. కుటుంబసభ్యులతో ఆదివారం స్వగ్రామానికి వచ్చేశారు. స్థానికులు వాళ్లను ఊరికి దూరంగా ఉన్న ఓ కల్లంలో ఉండాలని సూచించారు. ఇంతలో అసిరినాయుడు పరిస్థితి విషమించింది. కిందపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వెళ్లేందుకు ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కరోనా భయంతో తల్లి ఎంత వద్దంటున్నా.. కన్నతండ్రి మీద ప్రేమను చంపుకోలేక కుమార్తె వెళ్లి ఆయన గొంతులో నీరు పోసింది. ఆ వెంటనే ఆయన తుదిశ్వాస విడిచాడు.

తండ్రికి కరోనా.. ప్రేమ ఆగునా..!
Last Updated : May 3, 2021, 8:34 AM IST

ABOUT THE AUTHOR

...view details