ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దంపతుల మధ్య గొడవ.. అడ్డొచ్చిన కుమార్తెను చంపేసిన తండ్రి - AP Latest News

Father killed his daughter : శ్రీకాకుళం జిల్లాలో దారుణ హత్య జరిగింది. కన్నతండ్రే కుమార్తె పాలిట యముడయ్యాడు. అనుమానంతో భర్త భార్యపై దాడి చేస్తుండగా.. కుమార్తె అడ్డుపడడంతో కత్తితో అతి కిరాతకంగా దాడి చేసి చంపేసాడు. భార్యకూ తీవ్ర గాయాలయ్యాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీం తో పరిశీలించి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Father killed his daughter
Father killed his daughter

By

Published : Feb 17, 2023, 10:18 PM IST

Father killed his daughter : శ్రీకాకుళం మున్సిపాలిటీ ఐదవ వార్డు సొట్టవానిపేట కాలనీలో దారుణ హత్య జరిగింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కుమార్తె పాలిట యముడయ్యాడు. అనుమానంతో భార్యపై దాడి చేస్తుండగా.. కుమార్తె అడ్డం వచ్చింది.. అయినా ఆగని తండ్రి కత్తితో కుమార్తెను నిర్దాక్షిణ్యంగా నరికి చంపిన ఘటన.. శ్రీకాకుళం మున్సిపాలిటీ ఐదవ వార్డు సొట్టవానిపేట కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భర్త రామారావు అనుమానంతో తన భార్య సూర్యంపై దాడి చేస్తున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కుమార్తె విజయ ఆ గొడవను ఆపడానికి యత్నించగా కన్న కుమార్తె అని చుడకుండా కత్తితో అతి కిరాతకంగా అక్కడికక్కడే నరికేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

అనంతరం భార్యపై దాడి చేయడంతో.. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ జరుగుతుండగా భార్య సూర్యం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో రామారావు ద్విచక్ర వాహనంపై పారిపోయాడు. అక్కడ ఉన్నవారు 108 వాహనానికి ఫోన్​ చేసి సమాచారం అందించడంతో.. ఆ వాహనం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోని.. కొన ఊపిరితో ఉన్న సూర్యంను శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆమెకు వైద్య అధికారులు చికిత్స చేస్తున్నారు. మృతి చెందిన కుమార్తె ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది.

అనారోగ్య కారణాల వల్ల ఇంకా వివాహం చేయలేదు. సంఘటనా స్థలానికి ఆమదాలవలస పోలీసులు చేరుకుని క్లూస్ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పైడయ్య తెలిపారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి శవ పంచనామా కోసం తరలించారు. హంతకుడు రామారావు పరారీలో ఉన్నాడని.. పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details