ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​:తండ్రిని కడసారి చూడలేకపోయిన కుమారులు - @corona ap cases

తండ్రిని పున్నామనరకం నుంచి కాపాడేవాడే కొడుకంటారు... నలుగురు కుమారులు ఉన్నా... ఆ తండ్రికి ఆ భాగ్యంలేకుండా పోయింది..అనారోగ్యంతో చనిపోయిన తండ్రిని చూసేందుకు రాలేకపోయారు...ఆ కొడుకులు.లాక్​డౌన్​ కారణంగా సొంత రాష్ట్రానికి రాలేక.... తండ్రిని చివరిసారైన చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు.శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన పూర్తివివరాలిలా ఉన్నాయి.

fater death in sikakulam sons are not able to come due to lock down
లాక్​డౌన్​:తండ్రిని కడసారి చూడలేకపోయిన కుమారులు

By

Published : Apr 20, 2020, 6:07 AM IST

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం చిన్నయ్య పేట గ్రామానికి చెందిన ఎడ్ల అప్పలనాయుడు(75) మృతి చెందాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా... బంధువులు పాలకొండ సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పలనాయుడు మృతి చెందారు. ఆయనకు నలుగురు కుమారులు వారంతా ఉపాధి నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లారు. లాక్​డౌన్​ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కుమారులు తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూడా వీలు లేకుండా పోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. బంధువులే అంతిమక్రియలు జరిపించారు.

ABOUT THE AUTHOR

...view details