యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎక్కడైనా యూరియా ఉందని సమాచారం అందిచే చాలు అక్కడికి పరుగులు తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పీఎసీఎస్ కేంద్రం వద్ద రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో సామాజిక దూరం లేకుండా ఎరువుల కోసం ఎగబడ్డారు. అన్నదాతలకు అవసరమైన ఎరువులను గ్రామాలకే తరలిస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నా.. ఆచరణకు మాత్రం నోచుకోవటం లేదు.
కరోనా అయినా డోంట్ కేర్.. యూరియా కోసం వెయిటింగ్ - యూరియా కోసం నరసన్నపేట రైతుల అవస్థలు న్యూస్
వేసిన పంట బాగా ఏపుగా పెరగాలన్నా... ఏ చీడపీడలు రాకుండా ఉండాలన్నా పంట వేసిన మెుదట్లోనే యూరియా వేస్తారు రైతులు. ఇప్పుడు యూరియా దొరక్కపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ యూరియా ఉందని తెలిసినా.. అక్కడకు పరుగులు తీసి క్యూలైన్లలో నుంచొని తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.
యూరియా కోసం రైతుల అవస్థలు