అఖిల భారత రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్నా నిర్వహించారు. డే ఆండ్ నైట్ కూడలి నుంచి ఆదాయపు పన్ను కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి.. రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.
దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేరళ తరహా రైతు బుణ విమోచన చట్టం చేయాలని.. జీవో నెంబరు 22ను రద్దు చేయాలని కోరారు.