ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers protest: శ్రీకాకుళంలో రైతుల ఆందోళన.. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ - ap latest news

Farmers protest: శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి చేలు నూర్పిడి చేపట్టి రెండు నెలలు కావస్తున్నా.. అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన చెందారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో అది జరగడంలేదన్నారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని.. రైతులు కోరారు.

Farmers protest in srikakulam to buy paddy
ధాన్యం కొనుగోలు చేయాలని శ్రీకాకుళంలో రైతులు ఆందోళన

By

Published : Mar 12, 2022, 1:33 PM IST

Farmers protest: శ్రీకాకుళం జిల్లా వంగరలోని పెదరాజులగమ్ముడ రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వరి చేలు నూర్పిడి చేపట్టి రెండు నెలలు కావస్తున్నా.. అధికారులు ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. క్షేత్ర స్థాయిలో అది జరగడం లేదన్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించవలసి వస్తుందని వాపోయారు. రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పటికీ.. ధాన్యం దళారులకు రూ.1100కు అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోలు చేయాలని శ్రీకాకుళంలో రైతులు ఆందోళన

ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి..రూ.1800, రూ.1900 లకు కొనుగోలు చేస్తామని చెబుతున్నప్పటికీ.. ఆ మద్దతు ధర మిల్లర్లకు, దళార్లకు వర్తిస్తుందని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details