శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సాగునీటి కోసం రైతులు ఆందోళన చేశారు. జిల్లాలోని పాలకొండ, బూర్జ మండలాల్లో వరినాట్లు వేసి నేటికి 90 రోజులు గడుస్తున్నా అధికారులు నీటిని విడుదల చేయడం లేదంటూ పాలకొండ నీటి పారుదల కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
సాగునీరు అందించాలంటూ పాలకొండలో రైతుల ఆందోళన
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో రైతులు ఆందోళన చేశారు. నాగావళి ఎడమ కాలువ ద్వారా పంటపొలాలకు సాగునీరు అందించాలని కోరారు.
పాలకొండలో రైతుల ఆందోళన