ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులను అడ్డగించిన రైతులు.. పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు

ఖరీఫ్ సమయంలో ఎలాంటి నోటీసు లేకుండా రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నించడం సరికాదని శ్రీకాకుళం జిల్లాలో రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అధికారులు తీసుకొచ్చిన యంత్రాలకు అడ్డంగా రైతులు బైఠాయించడం కొద్ది సమయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పంట పొలాల్లో ఎలా చదును చేస్తారని రైతులు అధికారులను ప్రశ్నించారు.

farmers protest for their lands
అధికారులను అడ్డగించిన రైతులు

By

Published : Jul 2, 2020, 6:36 PM IST

అధికారులు అన్యాయంగా తమ భూములు లాక్కుంటున్నారని శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలోని రైతులు అధికారులను అడ్డుకున్నారు. నవరత్నాల్లో భాగంగా పాలకొండ పట్టణంలోని పదహారు వందల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఇప్పటికే 30 ఎకరాల వరకు లుంబూరు గ్రామ సమీపంలో భూమి సేకరించారు. అధికంగా దరఖాస్తులు రావడం మరో ఆరు ఎకరాల సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువురు రైతులతో అధికారులు చర్చించి నాలుగు ఎకరాల భూమిని సేకరించారు. మిగిలిన భూమిని సేకరించేందుకు వెళ్ళినా అధికారులకు రైతులు అడ్డుకున్నారు. ఖరీఫ్ సమయంలో ఎలాంటి నోటీసు లేకుండా రైతుల నుంచి భూములు తీసుకునేందుకు ప్రయత్నించడం సరికాదని రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఇన్​ఛార్జ్​ తహసీల్దార్ రాజశేఖర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోవడం అధికారులు భూ సేకరణ నిలిపివేసి వెనుతిరిగారు.

ఇవీ చూడండి...

నూతన 104, 108 వాహనాలను ప్రారంభించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్

ABOUT THE AUTHOR

...view details