ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగు భూమిపై హక్కులకు రైతుల ధర్నా.. అరెస్టులతో పరిస్థితి ఉద్రిక్తం

శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం సమీపంలోని నారాయణపురం సాగు భూములకు హక్కులు కల్పించాలని రైతుల చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేయటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సాగు భూమిపై హక్కులకు రైతుల ధర్నా
సాగు భూమిపై హక్కులకు రైతుల ధర్నా

By

Published : Jun 8, 2022, 9:25 PM IST

శ్రీకాకుళం జిల్లాలో తరతరాలుగా సాగు చేస్తున్న భూమికి సాగుహక్కులు కల్పించాలని చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలోని నారాయణపురం భూములపై సాగు హక్కులు కల్పించాలని రైతులు చాలా రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆ వివాదాస్పద భూమిని చదును చేయడానికి సర్వే అధికారులు పోలీసు బందోబస్తుతో జేసీబీలను తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని.. వేరే వారికి ఇస్తే ఒప్పుకోమని ధర్నా చేపట్టారు. పోలీసులు కొంతమంది రైతులని అరెస్ట్‌ చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సాగు భూమిపై హక్కులకు రైతుల ధర్నా

ABOUT THE AUTHOR

...view details