ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వేను అడ్డుకున్న రైతులు...వెనుదిరిగిన అధికారులు - srikakulam

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో హై లెవల్ కెనాల్ నిర్మాణానికి చేపడుతున్న సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. తమ పొలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆందోళన చేశారు.

సర్వేను అడ్డుకున్న రైతులు

By

Published : Apr 25, 2019, 11:24 PM IST

సర్వేను అడ్డుకున్న రైతులు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో చేపడుతున్న హై లెవల్ కెనాల్ నిర్మాణ సర్వే పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. వంశధార నది నుంచి బహుదానది వరకు సుమారు 108 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కెనాల్ నిర్మాణానికి భూ సర్వే చేస్తున్నారు. గురువారం పెద్ద లోగిడి, గురాండి గ్రామాల వద్ద అధికారులు సర్వే చేస్తుండగా... రైతులు అభ్యంతరం చెప్పారు. తమ పొలాల్లో ఛానల్, మినీ రిజర్వాయర్ నిర్మాణాలు చేపట్టొద్దని ఆందోళన చేశారు.

భూ సర్వే అడ్డుకోవడంతో వంశధార ప్రాజెక్ట్ డీఈఈ ప్రభాకర్ శర్మతోపాటు పలువురు అధికారులు గ్రామాలను సందర్శించారు. కాగా... తమకు ఎటువంటి హామీ ఇవ్వకుండా... పంట పొలాల్లో సర్వే చేయడమేంటని రైతులు ప్రశ్నించారు. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి అనంతరం రైతులు అనుమతులతో సర్వే చేపట్టాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details