శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామం వద్ద వంశధార శాఖ అధికారులను రైతులు మంగళవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా వెళ్లి కాసేపు నిర్బంధించారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ నుంచి శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని వాగ్వివాదానికి దిగారు. జిల్లాలోని చిన్నసాన ఎత్తిపోతల పథకం పరిధిలో సుమారు 2,300 ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు నిలిపివేస్తే తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నించారు. అధికారుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.
సాగునీటి కోసం అధికారులను నిర్బంధించిన రైతులు
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్నసాన గ్రామం వద్ద వంశధార శాఖ అధికారులను రైతులు మంగళవారం మధ్యాహ్నం అడ్డుకున్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువ నుంచి శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదని వారితో వాగ్వాదానికి దిగారు.
సాగునీటి కోసం అధికారులను నిర్బంధించిన రైతులు
కాలువలో నీరు లేనందున కొద్దిరోజులపాటు ఎత్తిపోతల పథకానికి నీరు నిలుపుదల చేస్తామని, రైతులు పరిస్థితి అర్థం చేసుకుని సహకరించాలని అధికారులు కోరారు.
ఇవీ చదవండి: చివరి ఆయకట్టుకు అందని వంశధార నీరు
TAGGED:
సాగునీటి కోసం రైతుల ఆందోళన