ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Farmers are Worried about Suspension Lift Irrigation Schemes: ఎత్తిపోతల పథకాలు నిలుపుదల.. అన్నదాతల ఆగ్రహం - రాష్ట్రంలో రైతుల కష్టాలు

Farmers are Worried about Suspension Lift Irrigation Schemes: రైతు దేశానికి వెన్నెముక అంటారు. కానీ వైసీపీ ‌ప్రభుత్వం అన్నదాత వెన్నెముకనే విరిచేస్తోంది. మెట్ట భూముల కోసం వంశధార ప్రధాన కాలువలపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేసింది. జగన్‌ రైతు పక్షపాతి కాదు.. కక్షపాతి అంటూ.. సిక్కోలు కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Farmers_are_Worried_about_Suspension_Lift_Irrigation_Schemes
Farmers_are_Worried_about_Suspension_Lift_Irrigation_Schemes

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 10:59 AM IST

Updated : Sep 2, 2023, 11:42 AM IST

Farmers are Worried about Suspension Lift Irrigation Schemes: ఎత్తిపోతల పథకాలు నిలుపుదల.. అన్నదాతల ఆగ్రహం

Farmers are Worried about Suspension Lift Irrigation Schemes :రైతు దేశానికి వెన్నెముక అంటారు. కానీ వైసీపీ ‌ప్రభుత్వం అన్నదాత వెన్నెముకనే విరిచేస్తోంది. మెట్ట భూముల కోసం వంశధార ప్రధాన కాలువలపై నిర్మించిన ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేసింది. వాటినే నమ్ముకుని వేలాది ఎకరాలు సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. బీడుబారుతున్న పంట భుములను చూసి కన్నీటిపర్యంత మవుతున్నారు. జగన్‌ రైతు పక్షపాతి కాదు.. కక్షపాతి అంటూ.. సిక్కోలు కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Srikakulam District Farmers Fires on YSRCP Government Decisions : శ్రీకాకుళం జిల్లాలో మెట్ట ప్రాంతాలకు నీరందే విధంగా వంశధార ప్రధాన కాలువలపై అనేక ఎత్తిపోతల పథకాలను నాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. ఎత్తిపోతల ద్వారా వేలాది ఎకరాలు సస్యశ్యామలమయ్యాయి. అయితే వైసీపీ ప్రభుత్వం.. టీడీపీ ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేసే దిశగా చర్యలు చేపట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'ఎండ మండుతోంది.. పైరు ఎండుతోంది'.. మరో రెండు రోజుల్లో అలా జరగకుంటే..!

టెక్కలి నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించే.... 5 ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేయకపోవడంతో పొలాలు బీడుబారుతున్నాయి. సౌడాం, నారాయణపురం, మదన గోపాల సాగరం, చినసాన, సుభద్రాపురం ఎత్తిపోతల పథకాలు నిలిపివేస్తున్నట్లు ఆగస్టు 25వ తేదీన నీటుపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో విద్యుత్ శాఖ అధికారులు వాటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎత్తిపోతల పథకాల కింద దాదాపు 10 వేల ఎకరాల పంట పొలాలు ఉన్నాయి . వర్షాలు కూడా ముఖం చాటేయడంతో వరి నాట్లు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.


"ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాము. భూమి అంతా బీటలు బారాయి. ఇప్పుడు కానీ నీళ్లు ఇవ్వకపోతే అప్పుల పాలు అవుతాం. మేము ఆత్మహత్యలు చేసుకోవడం తప్పితే వేరే మార్గం లేదు. ఈ ప్రభుత్వం మా మీద దయ ఉంచి సాగు నీరు ఇస్తారని నమస్కరిస్తున్నాం."- రైతులు

NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా! వర్షాభావ పరిస్థితులపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు..?

అధికారులు తీసుకున్న నిర్ణయంతో రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పంటలు వేశాక ఇప్పుడు నీరు నిలిపివేస్తామంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి సిదిరి అప్పలరాజు కక్ష పూర్వితంగా వ్యవహరిస్తున్నారని అందుకే నీటి సరఫరాను నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట వేస్తే ఇప్పుడు అర్ధాంతరంగా నీరు నిలిపివేస్తే ఆత్మహత్యలే గతి అని వాపోతున్నారు.

"మూడు ఎకరాల భూమికి 20 వేల రూపాయలు ఖర్చు పెట్టాను. ఇప్పుడు భూమి మీద చుక్క నీరు లేదు.మీకు రెండు చేతులెత్తి దండం మొక్కుతున్నాం. మాకు సాగు నీరు వచ్చే విధంగా చర్యలు తీసుకోండీ సారూ.. మీరు మా మీద దయ ఉంచి తగిన చర్యలు తీసుకుంటే మేము బతుకుతాం. లేకపోతే ఎక్కడివాళ్లం అక్కడ చనిపోతాం."- రైతులు

Farmers Stuck in Grip of Drought: రాష్ట్రంలో కోరలు చాస్తోన్న కరవు.. ఎండిపోతున్న పంటలతో అన్నదాత ఆవేదన

Last Updated : Sep 2, 2023, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details