శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామ రైతులు సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని 250 మంది రైతులు పంట నష్టపోయారు. గతేడాది ఖరీఫ్ సీజన్లో జరిగిన పంట నష్టానికి… బీమా కింద ప్రభుత్వం పరిహారం అందజేసింది. పరిహారం అందుకునేందుకు అన్నీ అర్హతలు ఉన్న కొంతమందిని పక్కన పెట్టి అనర్హులకు చెల్లింపులు చేశారంటూ రైతులు ఆరోపించారు. రొయ్యల చెరువులకు, లేఅవుట్లకు పరిహారం ఎలా చెల్లించారో చెప్పాలంటూ సచివాలయంలోని వ్యవసాయాధికారిని నిలదీశారు. క్షేత్ర స్థాయిలో కార్యాలయ సిబ్బంది పనితీరు సరిగా లేకపోవటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు పరిహారం చెల్లించాలంటూ… పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిహారం అందలేదని గ్రామ సచివాలయం వద్ద రైతుల ఆందోళన - naupada latest news
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామ సచివాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. పంట నష్టపోయిన రైతుల్లో అర్హులైన వారికి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులు