ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు చేయడం లేదని... రైతుల ఆందోళన - katthula kaviti farmers agitation update

"ఖరీఫ్​లో పండించిన పంట.. ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు.. పక్క గ్రామానికి లారీలు వస్తున్నాయి.. మరి మా గ్రామానికి ఎందుకు రాలేదు" అంటూ.. రైతులు ఆందోళనకు దిగారు ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కత్తుల కవిటిలో జరిగింది.

farmers agitation
రైతుల ఆందోళన

By

Published : Feb 20, 2021, 10:44 AM IST

రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తుల కవిటి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ఖరీఫ్​లో పండించిన పంటను... పొలాల్లోనే నిల్వ చేశామని.. నెలలు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేయటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలో 600 ఎకరాల్లో ఇప్పటికీ పొలాల్లోనే ధాన్యం బస్తాలు ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు రావటంతో.. రైతు భరోసా కేంద్రానికి వెళ్తే.. అక్కడ సిబ్బంది సరైన సమాధానం చెప్పటం లేదని ఆరోపించారు.

ఆర్డీవో టీవీఎస్​జీ కుమార్​కు.. ఈ సమస్యపై రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అప్పారావు గ్రామానికి రాగా.. రైతులు ఆయన్ను నిలదీశారు. పంటను ఇంకెప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. పక్క గ్రామానికి వచ్చే లారీలు.. తమ గ్రామానికి ఎందుకు రావటం లేదని నిలదీశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా త్వరలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని.. తహసీల్దార్ హామీ ఇచ్చిన తర్వాత... రైతులు శాంతించారు.

ABOUT THE AUTHOR

...view details